ప్రజాశక్తి - కారంచేడు
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రిమాండ్ ఎత్తివేయాలని కోరుతూ స్థానిక టిడిపి కార్యాలయంలో 13వ రోజు ఆందోళన నిర్వహించారు. మహాత్మా న్యాయం ఎక్కడంటూ ప్లేకార్డులు ప్రదర్శించారు. ఎఎంసి మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి నాయకులు కంభంపాటి నరేంద్ర, పాతూరి ఆదిలక్ష్మి, పోతిన వెంకటేశ్వర్లు, తాళ్లూరి అనిల్ కుమార్, షేక్ కాలిషా వలి, కొల్లా భాస్కరరావు, గద్దె సబ్బయ్య పాల్గొన్నారు.










