Oct 30,2023 01:23

పొన్నూరు రూరల్‌: రాష్ట్రంలోని వెనుక బడిన తరగతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌, భారతరత్న బాబు జగజీవన్‌ రామ్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రశంసించారు. సామాజిక తత్వవేత్త, కుల వ్యవస్థ నిర్మూలన వాది, బహుజన ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు గోవిందరావు పూలే విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయంగా, ఆర్థికంగా, సామా జికంగా బీసీలు అభివద్ధి సాధించి నప్పుడు వెనుకబాటు తనం దూరం అవుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన రెడ్డి విశ్వానమని, ఆ దిశగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. రాజ్య సభ సభ్యులు, మోపిదేవి వెంకటరమణ రావు మాట్లా డుతూ ప్రతి పౌరుడు సమాజంలో గౌరవ మర్యాదలతో విరాజిల్లటానికి విద్య ఇంధనంగా పనిచేస్తుందని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో స్త్రీలకు మనోభావాలు, కోర్కెలు నెరవేర్చాలని ఆలోచన ఉండాలని పొందు పరిచారన్నారు. పొన్నూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకు కృషి జరుగుతోందని చెప్పారు. వైసిపి బీసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ సామాజిక వివక్షతకు గురైన వర్గాలకు మార్గాన్ని అన్వేషించిన మహౌన్నత వ్యక్తి పూలే అన్నారు. అనంతరం అతిధులను ఘనంగా సత్కరిం చారు. విగ్రహ నిర్మాణ దాత, ముదిరాజ్‌ ఐక్య మహాసభ వ్యవస్థాపకులు మాకాని రమేష్‌ బాబు, బీసీ నాయకులు కొల్లేరు శ్రీనివాసరావు, స్టేట్‌ మైనార్టీ కమిషన్‌ సభ్యులు షేక్‌ సైఫుల్ల, ఏఎంసీ చైర్మన్‌ ఆకుల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు బొద్దులూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.