Aug 22,2023 22:13

బలిజిపేట : మహిళలతో మాట్లాడుతున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయచంద్ర

ప్రజాశక్తి - బలిజిపేట : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్న మహాశక్తితో ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర అన్నారు. మండలంలోని సుభద్ర, మిర్తివలస గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన మహిళా మహాశక్తి, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల టిడిపి అధ్యక్షులు పెంకి వేణుగోపాల్‌ నాయుడు అధ్యక్షతన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ద్వారపురెడ్డి జగదీష్‌, బొబ్బిలి చిరంజీవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహాశక్తి, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళలతో కలిసి విస్తత ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ మహాశక్తి, భవిష్యత్తు గ్యారెంటీతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అరాచక అవినీతి పాలన ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కావున ఒక్కసారి ఆలోచించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీదేవి, పెంకి పార్వతి, గొట్టాపు వెంకటనాయుడు, సీతారాం నాయుడు, చంద్రమౌళి, రామ్మోహన్‌ నాయుడు, క్లస్టర్‌ ఇంఛార్జులు ఎస్‌.రాంబాబు, జి.బాబ్జీ పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలోని గాడిదపాయి, తాడిపాయి, జయపురం పంచాయతీల్లో సీతంపేట మండల టిడిపి అధ్యక్షులు సవరతోట మొఖలింగం ఆధ్వర్యంలో మహాశక్తియాత్ర మంగళవారం నిర్వహించారు. మహాశక్తి ప్రచారకర్త తోయక సంధ్యారాణి గాడిదపాయి, తాడిపాయి, జయపురం పంచాయతీల్లో గల గ్రామాల్లో ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు ఆమెతో చెప్పుకున్నారు. అలాగే పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలను భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పంచాయతీకి కావాల్సిన అన్ని సౌకర్యాలను నెరవేర్చుకోగలమని, నిమ్మక జయకష్ణను గెలిపించుకుంటేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి ఆరిక సువర్ణ, వరలక్ష్మి, రామారావు, భూషణ్‌, వరలక్ష్మి, శేఖర్‌, ఆనంద్‌, సవర సంతు, మోహన్‌, సవర తిక్కమ్మ, సరోజిని, స్థానిక మహిళా నాయకులు పాల్గొన్నారు.
వైసిపి నాలుగున్నర ఏళ్లలో ఉపాధి కరువు
గుమ్మలక్ష్మీపురం : రానున్న 2024 ఎన్నికల్లో టిడిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కురుపాం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని సెంటర్‌గూడలో మహాశక్తి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గిరిజన అభివృద్ధి టిడిపితోనే సాధ్యమవుతుందన్నారు. వైసిపి నాలుగున్నర ఏళ్లు పాలనలో గిరిజనులు ఉపాధి అవకాశాల్లేక పెరుగుతున్న ధరలతో జీవనం సాగించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇంచార్జి వెంకటరావు, యూనిట్‌ ఇంచార్జి బుజ్జేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నాగవేణి, కళావతి, అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ కార్యదర్శి తాడంగి రామారావు, నియోజకవర్గ ఎస్‌ టి సెల్‌ కార్యదర్శి అడ్డాకుల నరేష్‌ ఉన్నారు.