ప్రజాశక్తి -బలిజిపేట : చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్న మహాశక్తితో ప్రజల భవిష్యత్తు గ్యారంటీగా బాగుపడుతుందని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. మండలంలోని అరసాడలో మహిళా మహాశక్తి, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో శుక్ర వారం నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షులు పెంకి వేణుగోపాల్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో మహాశక్తి, భవిష్యత్తు గ్యారెంటీ సుమారు 500 మంది మహిళలు కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన రెండు గ్రామాల్లోని సభల్లో ఆయన మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మహాశకి,్త భవిష్యత్తు గ్యారెంటీతో రాష్ట్ర ప్రజలు తప్పక బాగుపడడం జరుగుతుందన్నారు. ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆర్థికంగా ఉపయోగపడే పథకాలపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న వైయస్సార్సీపి ప్రభుత్వ అరాచక అవినీతి పాలన ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, సీతారాంనాయుడు, చంద్రమౌళి, రామ్మోహన్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ ఎస్.రాంబాబు, జి.బాబ్జీ, జి.సింహాచలంనాయుడు, కె.సింహాచలంనాయుడు, ఎం.చిన్నంనాయుడు, వి జగదీశ్వరరావు, జి.సింహాచలం, కె.రాంబాబు తదితరలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని కేదారిపురంలో బాబు ష్యూర్టీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కురుపాం నియోజకవర్గం ఇంచార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో 66 వేల కుటుంబాలని, 1,80,000 ప్రజలను చేరవేయడమే తమ ధ్యేయం అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని, కురుపాంలో టిడిపి జెండా ఎగరాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కడ్రక వెంకటరావు,యూనిట్ ఇన్చార్జి బుజ్జేశ్వరరావు, నాయకులు అడ్డాకుల నరేష్, రామా రావు పాల్గొన్నారు.
భామిని : టిడిపిని గెలిపించి, మన రాష్ట్రం అభివృద్ధికి బాటలు వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. మండలంలోని ఘనసరలో బాబు షూర్టీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భోగాపురపు రవినాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, మాజీ ఎంపిపి భూపతి ఆనందరావు, సర్పంచ్ లోపింటి రాజేష్, బూత్ ఇన్‌ఛార్జిలు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.










