Jul 23,2023 21:58

కురుపాం : ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వరి

మక్కువ: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి టిడిపి కార్యకర్త పనిచేయాలని ఎ.వెంకంపేట మాజీ సర్పంచ్‌ పెంట తిరుపతిరావు పిలుపునిచ్చారు. మండలంలోని ఎ.వెంకంపేట, కన్నంపేట గ్రామాల్లో మాజీ సర్పంచ్‌ బలగ రామకృష్ణ ఆధ్వర్యంలో మహా శక్తి పథకం ప్రచర కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ నాయకులు కంటే పార్టీ ముఖ్యమని, పార్టీ నిర్ణయంతో అంతా కట్టుబడి పని చేయాలని సూచించారు. ప్రస్తుం జరుగుతున్న ఓటర్‌ జాబితా తనిఖీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ తమ ఓట్లను సరిచూసుకోవాలని సూచించారు. ఇటీవలే టిడిపిలో చేరిన ఎస్టీ సెల్‌ నాయకులు హిముకర ప్రసాద్‌ కూడా ఈ కార్యక్రమంలోముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాల్లో ర్యాలీలుగా టిడిపి శ్రేణులు వెళ్లే మహాశక్తి పథకం స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వెంకటభైరిపురం, చప్పబుచ్చింపేట మాజీ సర్పంచ్‌లు డి.పరమహంస, సిహెచ్‌ తిరుపతిరావు, కోన పంచాయితీ యూత్‌ లీడర్‌ కణం నాయుడు, మరిపి అప్పలనాయుడు, ఎం.పాపినాయుడు పలువురు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.
కురుపాం : టిడిపి మేనిపోస్టులో ప్రవేశపెట్టిన మహాశక్తి పథకం మహిళల సంక్షేమ పథకం అని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయం వద్ద మహాశక్తి శక్తి చైతన్య రథం వాహనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 'ఆడబిడ్డ నిధి' కింద నెలకు రూ.1500, అలాగే దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేలు చొప్పున పంపిణీ, మహిళలు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చనని, మహాశక్తి పథకం మహిళలకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక గాంధీ నగర వీధిలో ఇంటింటికి వెళ్లి మహాశక్తి కరపత్రాలు పంపిణీ పథకం ఆవశ్యకతను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి ఐదు మండల కన్వీనర్లు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాలకొండ రూరల్‌: మండలం బెజ్జి పంచాయతీలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ మహాశక్తి యాత్ర జరిగింది. టిడిపి మేనిఫెస్టో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని యూనిట్‌ ఇంచార్జ్‌ కర్నేన యోగిత అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ మహాశక్తి యాత్ర మహిళ నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్‌ అలుగోలు లక్ష్మి, వార్డు సభ్యులు వావిలపల్లి జగదీశ్వరి, తెగల లక్ష్మి, కడగల శ్రీదేవి, అలుగోలు గౌరిశ్వరి, పూడి మల్లేశ్వరి, మాజీ వార్డ్‌ సభ్యులు బొంతు పార్వతి, మహిళాసంఘాల కమిటీ సభ్యులు లక్ష్మి, బొంతు మూగతమ్మ, స్థానిక మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.