Aug 22,2023 19:06

రాజేష్‌ను కలిసిన మయూరి

ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్‌ను ఉత్తర కంచిలో కందుకూరు టౌన్‌ మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కంసాని మయూరి కలిశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలను చైతన్యపరచాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. అప్రజా స్వామిక పరిపాలనలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే పేదల గొంతులను నొక్కేస్తుందన్నారు.