
పోస్టర్లు అంటిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ప్రజాశక్తి - జగ్గయ్యపేట: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఎన్.టి.ఆర్.జిల్లా మహాసభలు జగ్గయ్యపేట పట్టణంలో ఈ నెల 25, 26 తేదీలలో జరగనున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని షేర్ మహమ్మద్ పేట, జగ్గయ్యపేట పట్టణంలో గోడపతులతో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఏం.సోమేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జి.గోపీనాయక్, ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు ప్రణరు తేజ, షేక్ రియాన్, షేక్ రెహ్మత్ పాల్గొన్నారు.