ప్రజాశక్తి -మాడుగుల: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరాటపు నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భవాని కోరారు. శుక్రవారం మండలంలోని బొడ్డరేవు గ్రామంలో మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసెంబర్ 8, 9, 10 తేదీలలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మహాసభలు జరగ నున్నాయని, ఈ సభలకు మాజీ ఎంపీ బృందా కారత్, ఆల్ ఇండియా అధ్యక్ష , కార్యదర్శులు విజయ రాఘవన్, బి.వెంకట్ హాజరు అవుతున్నారని తెలిపారు. ఈ సభలలో ఉపాధి హామీ పథకం లో 200 రోజుల పని కల్పించాలని, ప్రతి పేద కుటుంబానికి రెండు ఎకరాల భూమి, అర్హులైన పేదలకు ఐదు సెంట్ల స్థలం, ఐదు లక్షలతో గృహ నిర్మాణాలు చేపట్టాలని, ప్రజా పంపిణీ ద్వారా 15 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ, , వితంతు, వృధ్దాప్య, వికలాంగులు, ఒంటరి మహిళలకు రూ.5000 పింఛను చెల్లించాలని తదితర డిమాండ్లపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాసు, విజయశాంతి, నాగార్జున, ఈశ్వరరావు. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










