May 24,2023 22:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ చినరాజప్ప

ప్రజాశక్తి - పెద్దాపురం
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి టిడిపి నాయకుడు, కార్యకర్త కషి చేయాలని పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం స్థానిక సుధా కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎంఎల్‌ఎ చిన్నరాజప్ప మాట్లాడుతూ పట్టణ పరిధిలోని ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ ఇప్పటి నుండే టిడిపి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలన్నారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుకు కార్య కర్తలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం స్థానిక సుధా కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడు దిగ్విజయంగా జరుగుతుందన్నారు. మహానాడుకు బస్సులు వేస్తే సీజ్‌ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు రంది సత్యనారాయణ, తూతిక రాజు, టిడిపి మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు, ఎలిశెట్టి నాని, కాకినాడ రామారావు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట :
మహానాడు విజయవంతం చేయాలని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. జగ్గంపేటలోని బుధవారం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడును విజయవంతం చేయాలని సుమారు 20 నుంచి 30 వేల మంది అభిమానులను సేకరించి తీసుకురావాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 100 మినీ మహానాడు జరుపుకు న్నామని అమెరికాలో మినీ మహానాడు జరుపుకోవడానికి ఆ దేశం ఇచ్చిన అనుమతి ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శిలు ఎస్‌విఎస్‌ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, నాలుగు మండలాల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, చదరం చంటిబాబు, మంగరాతు రామకృష్ణ, కన్న బాబు, అడపా భరత్‌బాబు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, ఉంగరాల రాము, జంపన సీతారామచంద్ర వర్మ, పాండ్రంకి రాంబాబు, మండల మహిళా అధ్యక్షురాలు నకిరెడ్డి సూర్యవతి, మండలాల ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్‌ ఇన్చార్జులు పాల్గొన్నారు.