Nov 06,2023 21:29

ఐక్యతను చాటుతున్న వామపక్ష ట్రేడ్‌ యూనియన్‌, రైతు సంఘం నాయకులు

కడప అర్బన్‌ : మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27, 28న విజయవాడలో నిర్వహించే మహా ధర్నా జయప్రదం చేయాలని సిఐ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు పిలు పునిచ్చారు. వామపక్ష కార్మిక, రైతు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ విధా నాలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి సదస్సు నిర్వహి ంచారు. సదస్సుకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్య క్షులతో పాటు ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, రైతు సంఘాల రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్‌, రామచంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్త ప్రయో జనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాం కులలోని లక్షల కోట్ల రూపా యలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ, ఈ 9 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్‌ పేరుతో రుణమాఫీ చేసిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీల రుణాలు మాఫీ చేయడం కాదు, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓడరేవులు, ఎయిర్‌ పోర్టులు, విద్యుత్‌ సంస్థలు, రైల్వే, బొగ్గు గనులు, చివరకు ఆదివాసి, గిరిజనుల అటవీ భూములపై హక్కులను హరిస్తూ తాజాగా అటవీ చట్టానికి సవరణ పాస్‌ చేసిందని విమర్శించారు. ఈ చర్యల న్నీ కార్పొరేట్లకు ప్రత్యేకంగా మోడీ మానస పుత్రుడు గౌతమ్‌ అదానీని ప్రపంచ కుబేరులలో మొదటి స్థానానికి చేర్చేందుకు దోహద పడ్డాయన్నారు. సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బా రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి మనో హర్‌, అధ్య క్షులు శ్రీనివాసులురెడ్డి, రైతు సంఘాల జిల్లా కార్య దర్శులు దస్తగిరి రెడ్డి, సుబ్బారెడ,ి్డ వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్‌, అన్వేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి డబ్ల్యూ రాము, ఎఐటియుసి నగర అధ్యక్షులు మద్ది లేటి, అంగన్వాడీ యూనియన్‌ వర్కర్స్‌ జిల్లా అధ్య క్షులు లక్ష్మీదేవి, కార్యదర్శులు లక్ష్మీదేవి, మంజుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎఫ్‌ఐఆర్‌ కాపీలు దగ్ధం
కేంద్ర ప్రభుత్వం న్యూస్‌ క్లిక్‌ మీడియా సంస్థ అధిపతి ప్రబీర్‌ పురకాయస్థపై పెట్టిన అక్రమ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐ ఆర్‌ కాపీలను సోమవారం పాత బస్టాండ్‌లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం న్యూస్‌ క్లిక్‌ యాజ మాన్యంపై ఎఫ్‌ఐఆర్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిం చారు. ఉత్తరప్రదేశ్‌లోరైతులపై దాడి చేసి చంపిన వారిని తక్షణమే అరెస్టు చేయాలన్నారు.