
పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి సైదాపురం : బిజెపి పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని సంయుక్త కిసాన్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా అధ్వర్యంలో ఈ నెల 27 28వ తేదీలలో విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సైదాపురం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం డిపి పోలయ్య మీడియాతో మాట్లాడారు. పంటలన్నింటికి ఎం ఎస్ పి నిర్ణయించి చట్ట బద్దత కల్పిం చాలని కోరారు. రైతుల పాలిట ఉరితాడుగా మిగిలిన ఎలక్ట్రిసిటీ బిల్లును ఉప సంహరించుకోవాలని తదితర డిమాండ్లతో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఇంకా ఐఎఫ్‌టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్ మాట్లాడుతూ మాట్లాడారు. కార్యక్రమంలో వెంకట రమణయ్య, కష్ణయ్య,అంకయ్య లు పాల్గొన్నారు.