మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పూర్ణాహుతి
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో నారికేళములు, ముత్యం, పగడం, సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలు హోమగుండంలో ఆహుతిగా సమర్పించారు. ఆ తర్వాత వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల తర్వాత సదషం, నాగవల్లి కార్యక్రమాలు, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు. ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్.లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి
శ్రీశైలం క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. వీరు ముందుగా స్వామి అమ్మవారు దర్శించుకునేందుకు ఆలయ రాజ గోపురం వద్దకు చేరుకోగానే దేవస్థానం ఇఒ లవన్న, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేద పండితులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.










