Apr 10,2022 13:04

మగువనైతి నేను! జీవితాన చింతలకు కరువా?
అస్సలే ఓ చిందరవందర గందరగోళం....
నా ఆశయాలకై ప్రయాణం!! ఎన్నో ఎత్తుపల్లాలు!!
ఇంకెన్నో అవరోధాలు... జీవితం అంటే ఆశ లేదు! అంతస్థూలపై కోరికలేదు!!
మగువను కదా... ముత్యమంతవే నా ఆశలు!
ముత్యమంత విలువైనవి కూడా!!
ఆకాశమంత ఫీజులు... అయినా భయపడని నా అమ్మానాన్నలు!!
చదువు పూర్తిచేసుకుని... జీవితాన్ని మొదలుపెట్టె తరుణం!
నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే చాలని! వారి (తల్లిదండ్రులు) అభిప్రాయం...
ఇంతలో ఎందరివో నిందలు!
మగువనైతి కదా! నిందలకు కొరత లేదు!!
వేరే ఉద్దేశాలే వున్నాయని దెప్పిపొడుపులు..
హూ!!! ఏం ఉద్దేశాలు వుంటాయి ఈ మగువకు
కేవలం తన అస్థిత్వం తప్పా?!

మగువలం మేము...
మనువు మాత్రమే జీవితం అని నమ్మము!!

మగువలం మేము...
మనసుతో అలోచన చేస్తాము...

తండ్రి బాధ్యతను చేత పట్టిన ఓ మగువ...
పుట్టింటి పేరుని అత్తవారింట వెలుగొందించిన మరో మగువ!!

కుటుంబానికై తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ మగువ...
కుటుంబం తనని పట్టించుకోని మరో మగువ...

అమ్మలా ఓ మగువ...
చెలిమిలా ఓ మగువ...
భార్యగా ఓ మగువ...
తన వారికి బలంగా మారినా మరో మగువ....
మగువలకు మనువు మాత్రమే జీవితమా??
సమాధానం లేని ప్రశ్న!!
 

మధుప్రియ కుంచాల