
మాట్లాడుతున్న మాజీ జెడ్‌పి చైర్మన్ చెంచలబాబు యాదవ్
మెట్ట ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం
ప్రజాశక్తి-ఉదయగిరి:మెట్ట ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ జెడ్‌పి చైర్మన్ చెంచలబాబు యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం జరిగిన ఐఎబి సమావేశంలో
డెల్టా,నాన్ డెల్టా పేరుతో డెల్టా ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం ఎంతవరకు సమంజసంమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెల్టా ప్రాంతంలో వ్యవసాయ బోర్‌లో ఉన్న సోమశిల జలాలను 30 టీఎంసీలు ఉన్న డెల్టా ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందని, మెట్ట ప్రాంత రైతులను తీవ్రంగా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కావలి కాలువ ఆయకట్టు రైతులకు జలదంకి మండలంలోని కొండప నాయుడు ఉత్తర కాలువకు నీరు వదలకపోవడంతో దాదాపు మెట్ట ప్రాంతంలో 30వేల ఎకరాల రైతులు నిరాశకు గురయ్యారని ఆవేదన చెందారు. అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి మెట్ట ప్రాంత రైతులకు ఆదుకోని కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో సోమశిల లో 20 టీఎంసీలు నీరు ఉన్నప్పుడే మెట్ట ప్రాంత రైతులకు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు.