Oct 10,2023 22:39

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్షుడు గోపి నాయక్‌

ప్రజాశక్తి - నందిగామ : పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నందిగామ సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టల్‌ మూసివేతకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. కాలేజీ హాస్టల్స్‌కు సొంత భవనాలు వెంటనే నిర్మించాలని, నాడు - నేడు ద్వారా హాస్టల్‌ అభివద్ధి చేయాలని అన్నారు. సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్‌ బాట కార్యక్రమం చేపట్టిందన్నారు. నందిగామ నియోజకవర్గంలో వీరులపాడు, నందిగామ, కంచికచర్ల బాలుర వసతిగహం, నందిగామ పట్టణంలో ఉన్నా ఎస్‌.సి సాంఘిక సంక్షేమ బాలురు వసతి గహాన్ని, బాలికల ఎస్టీ గురుకుల పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పరిశీలించి విద్యార్థలుతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్‌ మాట్లాడుతూ వైస్సార్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం హాస్టల్‌ విద్యార్థులకు సరైన సదుపాయాలు, నిధులు మంజూరు చేయకపోవడం, సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ షేక్‌. జాహిదా, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ సభ్యుడు మాధవ్‌, గోపి, తదితరులు పాల్గొన్నారు.