Oct 22,2023 21:21

మెరుగైన వైద్యసేవలందించండి :డిఎంహెచ్‌ఒ

 ప్రజాశక్తి -నందలూరు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిఎంహెచ్‌ఒ కొండయ్య వైద్యులను ఆదేశించారు. ఆదివారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పిహెచ్‌సిలో రికార్డులను పరిశీలించారు. అనంతరం పిహెచ్‌సి హెల్త్‌ బ్లాక్‌, నూతన భవనం నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌ సజన మాట్లాడుతూ 11 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించినట్టు తేలిపారు. జెఎఎస్‌ శిబిరం ద్వార పేద ప్రజలకు మెరుగైన వైద్యం అంది స్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పి ఆరిఫ్‌ బాబు, ఎంపిహెచ్‌ఎ లక్షుమయ్య పాల్గొన్నారు.