ప్రజాశక్తి- మెరకముడిదాం : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని గర్భాం-2 సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గర్భాం మేజర్ పంచాయతీకి సంబంధించి ఏడు గ్రామాల నుండి వచ్చిన రోగులకు ఏవిధమైన వైద్య సేవలు అందుతున్నాయి, ఏఏ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఎంత మందిని ఇంకా మంచి వైద్యం కోసం రిఫర్ చేశారు, ఎంతమంది రోగులు హాజరయ్యారు అనే విషయాలను వైద్యాధికారులు అనిల్ రామ్ కుమార్ రెడ్డి, అజరుని అడిగి తెలుసుకున్నారు. కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న కౌంటర్ దగ్గరికి వెళ్లి తన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, సర్పంచ్ గాబ్రియేల్, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాడ్డి వేణుగోపాలరావు, జిల్లా కోశాధికారి ఎస్‌వి రమణరాజు, వైసిపి మండల అధ్యక్షులు కోట్ల విశ్వేశ్వరరావు, కెఎస్‌ఆర్కే ప్రసాద్, పప్పల క్రిష్ణ మూర్తి, బూర్లె నరేష్ కుమార్, సత్తారు జగన్ మోహనరావు, సత్తారు శ్రీను, తాడ్డి చంద్రశేఖర్, ఎంపిడిఒ ఎం. రత్నం, డిటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
తెర్ల్ణాం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి చీకటిపేటలో స్పందన కరువైంది. ఆ గ్రామ సచివాలయంలో కాగాం, చీకటి పేట, అరస బలగ, మోదుగవలస గ్రామాలున్నాయి. ఈ గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 2529 మందికి సర్వే చేశారు. అందులో బిపి 1834, షుగర్ 1373, ఐబీపీ 892, ఉన్నట్లు వైద్య సిబ్బంది లెక్కలు చూపించారు. వీరంతా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి హాజరు అవ్వాలని గ్రామాలలో ప్రజలకు స్లిప్పులు ఇచ్చారు. కానీ కార్యక్రమానికి మాత్రం కేవలం 250 మంది హాజరయ్యారు. దీంతో గ్రామాల్లో సర్వే చేసిందంతా ఉట్టి కాగితపు లెక్కలే తప్ప ప్రజల్లోకి కార్యక్రమం వెళ్లలేదన్న విమర్శలు తొలిరోజే ఎదరుయ్యాయి. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బి.రతన్ కుమార్, ఇఒపిఆర్‌డి నీలిమ, సర్పంచ్ పార్వతి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
డెంకాడ: ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు అన్నారు. మండలంలోని మోధవలస సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి పిన్నింటి తమ్ము నాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూపరాణి, తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, సర్పంచ్ కనకల పోలమాంబ, నాయకులు కనకాల రామారావు, రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ బోని అప్పలనాయుడు, ఎర్రినింటి కృష్ణ, మోపాడ, డెంకాడ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మంగళవారం రామతీర్ధం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ళ సుధారాణి, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, సర్పంచ్ కంచరాపు కళావతి, ఎంపిడిఒ జి.రామారావు, నాయకులు కంచరాపు రాము, తర్లాడ దుర్గారావు, డాక్టర్ల బృందం, మెడికల్ స్టాఫ్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కొత్తవలస: మండలంలోని వీరభద్రపురం సచివాలయంలో జగనన్న సురక్ష ఉచిత మెగా వైద్యశిభిరంలో 340 మందికి తనిఖీలు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ ఇ. గోపాలకృష్ణ తెలిపారు. డాక్టర్ వైఎస్‌ఆర్ కంటి వెలుగు కళ్లద్దాలు 5 మందికి నెక్కల నాయుడుబాబు అందించారు. మెగా వైద్య శిభిరానికి వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, తహశీల్దార్ శ్రీనివాస్ మిశ్రా, ఎంపిడిఒ వై. పద్మజ, మాజీ ఎంపిపి గొరపల్లి శివ, వైసిపి మండల నాయకులు ఒబ్బిన నాయుడు, మేలాస్త్రి అప్పారావు, బొంతల వెంకటరావు, సర్పంచ్ గేదెల రాములమ్మ, గేదెల త్రినాథమూర్తి, వైస్ సర్పంచ్ కె. నరసింగరావు, పంచాయతీ సెక్రటరీ బి. శైలజ, పిహెచ్‌సి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. శృంగవరపుకోట: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని చింతలబడి గ్రామ సచివాలయం-1 పరిధిలో గల ప్రజలకు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, ఎంపిపి సండి సోమేశ్వరరావు, వైస్ ఎంపిపి ఇందుకూరి సుధారాజు, ఎస్.కోట మేజర్ పంచాయితీ సర్పంచ్ జి.సంతోషికుమారి, తహశీల్దార్ శ్రీనివాసరావు, పంచాయితీ విస్తరణాధికారి లక్ష్మి, వైద్యాధికారులు, పంచాయితీ కార్యనిర్వహణాధికారి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రామభద్రపురం : పేద ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం ఇంటింటికి వైద్యం పేరిట ప్రవేశ పెట్టిన జగనన్న సురక్ష పధకం పేదల ఆరోగ్యానికి రక్ష అని ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని భూశాయవలస సచివాలయం వద్ద జగనన్న సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని తహశీల్దార్ రాజారావు, ఎంపిడిఒ రమామణి ఆధ్వర్యంలో సందర్శించారు. వైద్యాధి కారులు రత్న దీపక్, ఏయల్జీ శిరీష, అపర్ణ, సౌజన్యలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.పార్ధసారధి, విఆర్‌ఒ ఆనందరావు, ఆరోగ్య సహాయకురాలు యన్ హైమావతి, ఎఒ అక్కారావు, ఇఒపిఆర్‌డి రాజు, సీనియర్ సహాయకులు చొక్కాపు శ్రీరాములు నాయుడు, పూడి కిరణ్, సచివాలయం కన్వీనర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు, వివిధ సచివాలయాల డిజిటల్ సహాయకులు, మహిళా పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.










