Jun 11,2023 00:40

వైఎస్‌ఆర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రజని

ప్రజాశక్తి-సీతమ్మధార : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. జివిఎంసి 48వ వార్డు పరిధి బాబూజీనగర్‌లో సుమారు రూ.1.07 కోట్లతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి రజని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ ఇంటి వద్దకే వైద్యం అందేలా ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని తెలిపారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ, నగర పరిధిలో ప్రతి వార్డులో ప్రాథమిక ఆరోగ్య ప్రారంభించారని తెలిపారు. ఉత్తర నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త కెకె.రాజు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, వార్డు కార్పొరేటర్‌ గంకల కవిత, ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు అనీల్‌కుమార్‌ రాజు, అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, వావిలిపల్లి ప్రసాద్‌, సారిపిల్లి గోవింద్‌, ఆళ్ల లీలావతి, ఉషశ్రీ, చల్లా రజిని, వార్డు ఇన్‌ఛార్జి నీలి రవి తదితరులు పాల్గొన్నారు.