Oct 04,2023 21:09

ఆస్పత్రిని ప్రారంభిస్తున్న డిప్యూటీస్పీకర్‌ స్వామి

ప్రజాశక్తి- పూసపాటిరేగ : కాస్వి ఆసుపత్రి ద్వార ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీర భద్రస్వామీ అన్నారు. విజయనగరంలోని ధర్మపురం కూడలిలో నూతనంగా నిర్మించిన కాస్వి ఆస్పత్రిని ఆయన బుధవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకమై సేవా దృక్పధంతో వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌ గజపతి రాజు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజి. శ్రీనివాసరావు, నెల్లిమర్ల, బొబ్బిలి ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకటచినప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామి నాయుడు, కోళ్ల లలితకుమారి, కెఎ నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, పాకలపర్తి రఘు రాజు, బోనాల విజయ చంద్ర, ఎస్‌పి ఎం. దీపికా పాటిల్‌, టిడిపి నాయకులు సువ్వాడ రవిశేఖర్‌, మహంతి చిన్నంనాయుడు, కడగల ఆనంద్‌, కర్రోతు సత్యనారాయణ, తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.