Aug 09,2023 23:24

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మెరుగైన పిఆర్‌సిని సిఎం జగన్‌ ప్రకటిస్తారని ఆశిస్తున్నామని ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కెవి.శివారెడ్డి తెలిపారు. బుధవారం కాకినాడ ఎన్‌జిఒ కార్యాలయంలో ఈ నెల 21, 22వ తేదీల్లో విజయవాడలో జరిగే ఎన్‌జిఒ 21వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సంఘం నేతలతో జరిగిన సమావేశంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పిఆర్‌సి కోసం పే కమిషన్‌ వేసినట్లు తెలిపారు. జిల్లాల పునర్విభజన జరిగిన సందర్భంగా గెజిటెడ్‌ ఉద్యోగులను కూడా తమ నిబంధనలను అసరించి తమ సంఘంలోకి చేర్చుకోనున్నట్లు ప్రకటించారు. హక్కుల కోసం పోరాటం చేసే ఏ ఉద్యోగికైనా సంఘానికైనా తమ మద్దతు ఉంటుందని వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న మహాసభల్లో ఎపి ఎంసి వైఎస్‌.జగన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఒపిఎస్‌ వచ్చేంతర వరకూ పోరాటం ఆగదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.రామ్మోహనరావు, పేపకాయల కష్ణ, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌, నాయకులు సరెళ్ల చందర్రావు, కెవిఎన్వి ప్రసాద్‌, కోశాధికారి వై.పద్మ మీనాక్షి, సంయుక్త కార్యదర్శులు ఎన్వికె.ప్రసాద్‌, ఎన్‌.వీరబాబు, బి.శ్రీనివాస్‌, ఎ.రంగారావు, రంజిత్‌ కుమార్‌ నాయుడు, ఎంవి.కృష్ణారెడ్డి, మట్టపర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.