తెనాలి: మెప్మా పరిధిలో బ్యాంకుల నుంచి రుణాలు పొం దిన పొదుపు మహిళలు తయారు చేసే వివిద ఉత్పత్తుల విక్రయం నిమిత్తం మెప్మా సిటి మిషన్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్‌కు విశేష స్పందన లభించింది. మెప్మా ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ సయ్యద్ ఖలేదా నశీం పరిశీలించారు. పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది స్వయం ఉపాది కోసం రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారని, వాటి మార్కెటింగ్ కోసం మెప్మా రాష్ట్ర మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు మూడు నెలలకోసారి మెప్మా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అర్బన్ మార్కెట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలు తయారు చేసిన పచ్చళ్లు, తిను బండారాలు, అప్పడాలు, ఒడియాలు, కుట్లు, అల్లికలు తదితరాలను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో సిఎంఎంవోలు మాధవరావు, అరుణకుమారి, సివోలు, ఆర్పీలు పాల్గొన్నారు.










