Nov 23,2022 23:38

రికార్డులు పరిశీలిస్తున్న ఉషారాణి

ప్రజాశక్తి-కొత్తకోట:అంగన్వాడీ కేంద్రాలలో మెనూ అమలు పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రావికమతం ఐసిడిఎస్‌ సిడిపివో ఉషారాణి అన్నారు. బుధవారం ఆమె కొత్తకోట సెక్టార్‌ పరిధి గాంధీ నగర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ పరిధిలో గర్భిణీ, బాలింత, కిషోర్‌ బాలికలు, చిన్నారులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. మెనూ అమలులో ఆశ్రద్ద వహించినా, పిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న గుడ్లు, బాలామృతం, వైఎస్‌ఆర్‌ కిట్లు, తదితర సరుకులు పంపిణి పారదర్శకంగా ఉండాలన్నారు. ముఖ్యంగా సమయ పాలన ఉండాలన్నారు. సెలవు దినాల్లో మినహా కేంద్రాలను తెరవకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి నిల్వలను తనిఖీ చేశారు. ఆమె వెంట సెక్టార్‌ సూపర్‌ వైజర్‌ విజయ, అంగన్వాడీ కార్యకర్త జానికి ఉన్నారు.