Jun 02,2023 23:25

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే

తాడేపల్లి రూరల్‌: ఎంటిఎంసిపరిధిలోని మెల్లంపూడి-నూతక్కి వరకు నిర్మాణం అవుతున్న బీటీ రోడ్డు పనులను మం గళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పరి శీలించారు. రెండున్నర కోట్ల సుమారు రెండు కిలో మీటర్ల మేర పొడవు ఉన్న రోడ్డును త్వరతిగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు. బీటీ రోడ్డు పూర్తయిన తర్వాత ఒక ద్వారం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు వెంబడి ఊరి శివారు వరకు విద్యుత్‌ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలని ఇంజ నీరింగ్‌ అధికారులకు ఆయన సూచించారు. కార్య క్రమంలో మున్సిపల్‌ ఏఈ కష్ణారెడ్డి, మెల్లంపూడి గ్రామ అధ్యక్షులు రాజారామిరెడ్డి పాల్గొన్నారు.