ప్రజాశక్తి- అనంతగిరి:మండల కేంద్రంలో సమిద పిరమిస్ట్ ల్యాండ్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ దిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సోమ్మెల. రూతు, జెడ్పిటిసి దీసరి గంగరాజు, ఎంపీపీ శెట్టి. నీలవేణిలు మెడికల్ క్యాంపును ప్రారంభించారు. వైద్యులు సోమేశ్వరరావు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, సమిధ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు.మారుమూల గిరిజన గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందక చాలామంది బాలింతలు, బాలికలు మృతి చెందుతున్నారన్నారు. ఎస్సై కె.రాము మాట్లాడుతూ,వైద్యంపై సరైన అవగాహన లేక పోవడంతోనే సకాలంలో వైద్య సేవలు పొందక చాలామంది మృత్యువాత పడుతున్నారన్నారు.260. మంది రోగులు వైద్య సేవలు పొందారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన వైద్యులు ప్రియాంక, దివ్యశిరిష, పాల్గొన్నారు.










