
ప్రజాశక్తి-నక్కపల్లి :మండలంలోని ఉద్దండ పురంలో మెగా వాటర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి వాడుకులోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం వాటర్ ప్రాజెక్టును పరిశీలించి సెల్పీ ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించాలన్న సంకల్పంతో ఉద్దండపురంలో మెగా వాటర్ ప్రాజెక్టు పనులు చేపటామని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగులు వేసుకున్నారే తప్ప పూర్తి చేయలేదన్నారు. వెంటనే ప్రాజెక్టు పనులను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించా లన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గింజాల లక్ష్మణరావు, నాయకులు వైయిబోయిన రమణ, వెలగా శ్రీనివాసరావు, దార్ల కృష్ణ, పక్కుర్తి నాగు, తుమ్మల వెంకటరమణ పాల్గొన్నారు.