ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని శరభవరం పంచాయతీలో ఎంవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వాణిజ్య వ్యాపారవేత ముత్యాల వెంకటేశ్వరరావు సందర్శించారు. ముత్యాల వెంకటేశ్వరరావుకి స్థానిక సర్పంచి చంద్ర ఆధ్వర్యంలో వివిధ గ్రామాల వచ్చిన వారు ఎంవిఆర్‌కు పూలతో స్వాగతం పలికారు.ఈ శిబిరానికి శరభవరం, కొంతలం, పాపంపేట, వడ్డీప, రత్నంపేట, ఆర్ల, బిబి.పట్నం, ఎంకె.పట్నం, రాజన్న పేట, సింగరాజుపేట, పెద్దపేట, జోగంపేట, బుచ్చంపేట, గదబూరు, నాయుడుపాలెం పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఆర్ధిక సహాయంతో వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ స్పషలిస్ట్ డాక్టర్ల బృందంతో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందించారు. ఎంవిఆర్ తనయుడు సతీష్ సంజుబాబు దగర ఉండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శరభవరం సర్పంచ్ చంద్ర, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంవిఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.










