పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిప్యూటీ సిఎం బూడి తదితరులు
ప్రజాశక్తి-దేవరాపల్లి
అమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మార్చి 12న నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టరును ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆదివారం మండలంలోని తారువలో ఉన్న తన క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందరత్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అమ్మ ఛారిటబుల్ ట్రస్టు చేపడుతున్న సేవలను ఉపముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్రెడ్డి బాబూరావు, ట్రస్టు చైర్మన్ గొంప వెంకట్రావు, వైస్ చైర్మన్ సింగంపల్లి అర్జున్, సభ్యులు బొబ్బిలి సన్యాసిరావు, వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిరికి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










