ప్రజాశక్తి -ములగాడ : పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం 60వ వార్డు పరిధి శ్రీహరిపురం గుల్లలపాలెం క్రీడా మైదానం వద్ద ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు, పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనందకుమార్, జీవీఎంసీ కో - ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరావు తదితరులు ప్రారంభించారు. ముందుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం రక్తదాతలకు ధ్రువీకరణపత్రాలు, మెమోంటోలను అందజేశారు. ఏటా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసి రక్తాన్ని సేకరించి ఎన్నో అవార్డులను సాధిస్తూ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతున్న పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, 60వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ పీవీ సురేష్ కు, ట్రస్టు సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు, రివార్డులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ డాక్టర్ పీవీ సురేష్, స్థానిక కార్పొరేటర్లు గుండపు నాగేశ్వరరావు, గులివిందల లావణ్య, పుర్రే పూర్ణశ్రీ, కొణతాల సుధ, బల్ల లక్ష్మణరావు, గల్లా చిన్నా, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కలిదిండి, పుర్రే సురేష్ యాదవ్, 58వ వార్డు వైసిపి అధ్యక్షులు గులివిందల కృష్ణ, వార్డుల కన్వీనర్లు దాడి సత్యనారాయణ, రేవళ్ళ సత్యనారాయణ, దొడ్డి కిరణ్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మజ్జి సోమేష్, బలిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










