ప్రజాశక్తి -పాడేరు : విజరు దివస్ సందర్భంగా జాతీయ సేవా పథకం పాడేరు ఆధ్వర్యంలో రక్త చైతన్యకర్త, రాష్ట్ర సేవా పురస్కార్ అవార్డు గ్రహీత గణేష్ కొమ్మోజు సహాయ సహకారంతో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు అమర సైనికులకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన యువకులు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. చిట్టిఅబ్బాయి, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్‌ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారుల గౌరీ శంకరరావు, పి రమేష్‌కుమార్, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు సెక్రటరీ ఈశ్వరరావు, రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షుడు ఎస్ గంగరాజు, కోశాధికారి పి.అప్పారావు, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు కొమ్మోజు రమణ, కొమ్మోజు గోవింద్,కె. ప్రసాదనాయుడు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు రక్తదాతలు పాల్గొన్నారు










