మెగా పీపుల్స్ సర్వే ఫలితాల్లో.. పార్లమెంటు సెగ్మెంట్లో ప్రథమ స్థానం..
అసెంబ్లీలో 9వ స్థానంలో నంద్యాల నిలిచింది : ఎంపీ, ఎమ్మెల్సీ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ పార్టీ చేపట్టిన మెగా పీపుల్స్ ఫలితాలను నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ భాష, మార్కె ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబన్నీసా,కన్వీనర్లు సలాముల్లా,రాజశేఖర్ రెడ్డి, బసవేశ్వర్ రెడ్డిలు ప్రకటించారు. ఏప్రిల్ ఏడవ తేదీ నుండి 29వ తేదీ వరకు వైయస్సార్ పార్టీకి చెందిన గృహసారథులు ఒక సైన్యంలా చేపట్టిన మెగా పీపుల్స్ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 45 లక్షల కుటుంబాలు పాల్గొనగా అందులో జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా ఒక 1కోటి19 వేలకు పైగా మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్స్ చేయడం జరిగిందని వెల్లడించారు. పార్లమెంట్ సెగ్మెంట్లలో నంద్యాలకు ప్రథమ స్థానం రాగా, అసెంబ్లీ స్థాయిలో నంద్యాల నియోజకవర్గానికి 9వ స్థానం లభించిందన్నారు. ప్రజలు వారికోసం, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, జగనన్నను విశ్వసిస్తున్నామని సర్వేలో వారి స్పందన ను బట్టి తెలుస్తుందన్నారు.శనివారం స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషలు మెగా పీపుల్స్ సర్వే వివరాలను వెల్లడించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సిపి క్యాడర్ నిబద్ధతగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మెగా పీపుల్స్ సర్వేను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సర్వే దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదని, అతిపెద్ద పబ్లిక్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు సర్వే నిలిచిందన్నారు. కుల, వర్గ, రాజకీయాలకు అతీతంగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా భారీ స్థాయిలో పాల్గొన్నారని, సర్వే కు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలు వారి భవిషత్తు కోసం జగనన్నను మత్రమే విశ్వసిస్తున్నామని చెప్పడానికి ఇదే సాక్ష్యం అన్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏ గడపకు వెళ్లినా మా నమ్మకం నీవే జగనన్న అనే నినాదం మారుమోగుతుందని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం అవినీతి రహిత, మధ్యవర్తులు లేని సంక్షేమ, అభివృద్ధి అందిస్తున్న ప్రభుత్వమని అందరూ నమ్ముతున్నారన్నారు. దీనికి కారణం సీఎం జగనన్న ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలన్నారు. ఈ ఫలితమే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి వైఎస్ఆర్సిపి ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని, జగన్ అనే మా భవిష్యత్తు మెగా పీపుల్ సర్వే ఫలితాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ నిబద్ధతకు తార్కానమన్నారు. ప్రజల నుండి వచ్చిన మద్దతు, సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం , పరిపాలనపై విశ్వసనీయతకు రుజువుగా నిలిచాని నమ్ముతున్నామని తెలిపారు. ఈ మెగా పీపుల్ సర్వే తో ప్రతిపక్షాలకు షాక్ కొట్టినట్లు అయిందని, ప్రతి పక్షాలు తమ కంచుకోటలని భావించిన ప్రాంతాల్లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి కి మద్దతుగా నిలిచారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర ప్రజలు తమకున్న నమ్మకాన్ని స్వచ్ఛందంగా తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన ఈ సర్వేలో పాల్గొన్న పార్టీ క్యాడర్, గృహసారథులు, కన్వీనర్లు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన మద్దతు, ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం మరింత బలపడేలా అదే ఉత్సాహం, విశ్వాసంతో సుపరిపాలన కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో వైఎస్ఆర్సిపి నాయకుడు నందం బాబురావు, వైఎస్ఆర్సిపి నాయకులు,, గృహ సారధులు కన్వీనర్లు పాల్గొన్నారు.










