మెగా మల్టీ స్కిల్ వర్క్ షాప్ ప్రారంభం
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
తిరుపతి కలెక్టరేట్ లో సెట్విన్,, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా మల్టీ స్కిల్ వర్క్ షాప్ ను రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కె రోజా, తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ చైర్మన్ డాక్టర్ వై ప్రవీణ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ సెట్విన్ ద్వారా ఉచితంగా నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నందు శిక్షణ పొంది ఉపాధి అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు మహిళలు అన్ని రంగాలలో ముందుకి వస్తున్నారని ఈ శిబిరంలో కూడా మహిళలు ఎక్కువగా ఉండడాన్ని గమనించి వారిని అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువతుల్లోని సజనాత్మక శక్తిని బయటకి తీసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనిని ఉపయోగించుకుని యువత వారి వత్తి నైపుణ్యాలు పెంచుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని శిక్షణ, నైపుణ్య అభివద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. దీనిని నిర్వహిస్తున్న సెట్విన్ డాక్టర్ మురళీకష్ణను అభినందించారు. ప్రవీణ్ మాట్లాడుతూ సెట్విన్ వత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, వాటిలో తనని భాగస్వామ్యం చేయడం ఒక భాగ్యమని, ఇటువంటి కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ మేనేజర్ మోహన్ కుమార్, హెచ్డి మీడియా వర్క్స్ హేమంత్, త్రివర్ణ ఆర్ట్స్ ఆర్కే చరణ్ వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో జెస్సీ గ్రేస్, పర్షియన్, పలు కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
వర్కుషాపులో మాట్లాడుతున్న మంత్రి ఆర్కె రోజా










