ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని జడ్డంగి గ్రామంలో మే 30 నుండి జూన్ 4వ తేదీ వరకు జరిగిన గిరి సీమ మెగా క్రికెట్ టోర్నమెంట్‌లో జడ్డంగి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జడ్డంగి, లాగరాయి జట్ల మధ్య జరిగగా ఈ మ్యాచ్‌లో జడ్డంగి జట్టు విన్నర్‌గా నిలిచింది, గ్రామ సర్పంచ్ కొంగర మురళీకృష్ణ టాస్ వేయగా, టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లాగరాయి టీమ్ 12 ఓవర్లకు 60 పరుగులు చేసింది. 61 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన జడ్డంగి జట్టు ఇంకా 4 బంతులు వుండగానే విజయం సాధించింది. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఇందులో పాల్గొన్న జడ్డంగి ఎస్‌ఐ షరీఫ్ మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సింగిరెడ్డి రవి, వార్డ్ మెంబర్ మఠం సత్తిబాబు, బారంగి రాజుబాబు, మాజీ వార్డ్ మెంబర్ కమాల బత్తుల రవి, రావుల లాలిబాబు, పులిమెట్ల బాబు, పులిమెట్ల కరుణ, రావుల రాము, ఈక గోపి మాస్టర్, కోటం సత్తిబాబు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.










