హాజరైన నిరుద్యోగులు
ప్రజాశక్తి-అరకులోయ :అరకులోయలోని ప్రభుత్వ ఆర్‌ఐటిఐలో శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ డ్రైవ్‌లో సుమారు 10 కంపెనీల నిర్వాహకులు పాల్గొని ఇంటర్వూ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 382 మంది నిరుద్యోగ యువత హాజరవ్వగా ఇందులో 132 మంది సెలెక్ట్ అయ్యారని జిల్లా నైపుణ్యభివద్ధి అధికారి జీ.ప్రశాంత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంప్లా య్మెంట్ అధికారి సంగీత, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.










