Apr 02,2023 23:02

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : మెగా డియస్సీని తక్షణమే విడుదల చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అన్నారు. కృష్ణాజిల్లా పోరంకిలె ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రామన్న మాట్లాడుతూ దాదాపు పది లక్షల మంది డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. 2019 నుండి ఇప్పటిదాకా ఈనాలుగు సంవత్సర కాలంలో టీచర్ల భర్తీకై డిఎస్సీ ప్రకటన రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్‌ఇచ్చి టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. డివైఎఫ్‌ఐ కృష్ణాజిల్లా కన్వీనర్‌ బాజీ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు పరమావధిగా పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే దిశగా నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా ఎక్కడా ఆలోచన చేయడం లేదని ఆరోపించారు. యువతకు ఇచ్చిన వాగ్థానాలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈసమావేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా నాయకురలు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, సంజిత్‌, కృష్ణ, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.