Sep 01,2023 00:47

మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడుకు రాఖీ కడుతున్న మహిళా కార్పొరేటర్లు

ప్రజాశక్తి-గుంటూరు : సోదరీ, సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా రాఖీ పండుగ నిలుస్తుందని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు అన్నారు. గురువారం రాఖీ పండుగని పురస్కరించుకొని నగర పాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు మేయర్‌కు సంపత్‌ నగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి రాఖీలు కట్టారు. మేయర్‌ మాట్లాడుతూ ఎటువంటి రక్తసంబంధమూ లేకపోయినా నగర పాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు అందరు తనని ఒక అన్నాలా, ఒక తమ్ముడిలా భావించి రాఖీలు కట్టారని, వారందరికీ అన్నలా, తమ్ముడిలా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ నాయకురాలు షేక్‌ నూరి ఫాతిమా, నగర పాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.