
గుంటూరు సిటి: పీకల వాగు వద్ద నివాసం ఉంటున్న 200 కుటుంబాలు ప్రజలు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ను సంపత్ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయ నను ఆదివారం కలిశారు. ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న తమ కొద్దిపాటిని స్థలాన్ని వదిలి మిగిలిన ప్రాంతాల్లో ఆధునికరణ చేసుకోవాలని మేయర్ ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. నగరంలోని 20వ డివిజన్ పరిధిలోని పీకల వాగు కట్టను ఆక్రమించుకొని 200 కుటుంబాలు నివ సిస్తున్నాయి. పీకలవాగు ఆధునీకరణలో భాగంగా కొన్నిరోజుల క్రితం జిఎంసి అధికారులు సదరు స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మేయర్‌ను వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో 20వ డివిజన్ పార్టీ అధ్యక్షులు కంతేటి శ్యామ్ శేఖర్,ఖాజా మొహిదీన్ పాల్గొన్నారు.