Nov 01,2023 00:01

మేరిగను కలిసిన తాళమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు

మేరిగను కలిసిన తాళమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు
ప్రజాశక్తి- రేణిగుంట : ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ విజిలెన్స్‌ అవగా హన వారోత్సవాలలో భాగంగా రేణిగుంట ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల, తపస్య ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల లో విద్యార్థులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ముందు విద్యార్థుల చేత 'అవినీతి రహిత సమాజం మా లక్ష్యం' అనే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అవినీతి వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి విద్యార్థులు అవినీతికి దూరంగా ఉండాలని, పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రులు అవినీతిపై పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. ఐఓబి రిటైర్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ జూలియన్‌ రాజు మాట్లాడుతూ మనదేశంలో పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య అవినీతి అన్నారు. వీటిని రూపుమాపాలంటే యువతతోనే సాధ్యమని నేటి పిల్లలు రేపటి పౌరులన్నారు. అత్యాశ వల్లే అవినీతి జాడ్యం ఉందని మీరు అత్యాశకు పోకుండా ఉన్నదాంట్లో సంతప్తి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఓబి సిబ్బంది భగవతి, విష్ణుప్రియ, గర్ల్స్‌ హై స్కూల్‌ హెచ్‌ఎం విష్ణువర్థని, తపస్య పాఠశాల కరస్పాండెంట్‌ విక్రమ్‌ పాల్గొన్నారు.