ప్రజాశక్తి - ఆస్పరి
టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోతో యువత భవితకు భరోసా కల్పిస్తున్నట్లు మాజీ ఎంపిటిసి మల్లికార్జున, టిడిపి యూత్ కన్వీనర్ రాఘవేంద్ర తెలిపారు. శుక్రవారం టిడిపి ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు స్థానిక గాంధీ పార్కు వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యువతకు ఉపాధి లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ యువతకు రూ.3 వేలు, 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు రూ.1500 ఆర్థిక సహాయం, ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, బీసీలకు రక్షణ చట్టాలు వంటి వాటిని మహానాడులో ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 ఎన్నికల్లో టిడిపి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేస్తామని పేర్కొన్నారు. టిడిపి నాయకులు సతీష్, తెలుగు యువత నాయకులు పూజారి మహేష్, మారేష్, మహానంది, మల్లేష్, రంగస్వామి, సంజీవ, శంకర్, ఉదరు పాల్గొన్నారు.
పాలాభిషేకం చేస్తున్న టిడిపి నాయకులు










