వీరఘట్టం: తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ ఆధునీకరణ పనులను వచ్చే ఏడాది మేనాటికి పూర్తి చేయాలని నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు గుత్తేదారుని ఆదేశించారు. మండలంలోని ఎం.రాజుపురం వద్ద కాలువపై నిర్మించిన వంతెన పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన కాలువలో లైనింగ్ పనులు చేపట్టినందు వల్ల కాలువలో నీటి ప్రవాహం వేగంగా పెరిగి శివారు ఆయకట్టు భూములకు త్వరితిగతిన సాగునీరు సరఫరా అవుతుందని తెలిపారు. పనులు చేపట్టిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలించాల్సిన అంశా లపై సాంకేతికపరమైన సూచనలి చ్చారు. చేపట్టిన పనులపై సంతప్తి వ్యక్తం చేస్తూ మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు క్వాలిటీ కంట్రోల్ చీప్ ఇంజనీరు ఎన్.పుల్లారావు, ఎస్‌ఇఎస్ సాయి శ్రీనివాస్, యాదవ్ బాల, ఇఇ డోల తిరుమలరావు, డిఇఇ లక్ష్మి, నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ డిఇ, ఇడి రవికుమార్, వీరఘట్టం, పాలకొండ ఎఇఇలు డివి రమణ, బి.శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.










