
ప్రజాశక్తి - గణపవరం
రైతులు మేలైన వ్యవసాయ పద్ధతులు పాటించి పురుగు మందుల వాడకం తగ్గిస్తే నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేయవచ్చని జి ల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని అప్ప న్నపేటలో బుధవారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సహాయ సంచాలకులు పి.మురళీకృష్ణ మాట్లా డుతూ రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించి అధిక దిగుబ డులు సాధించాలని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి వై.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని, ఇ కెవైసి ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని చెప్పారు. పశు వైద్యులు జ్యోతి మాట్లాడుతూ రైతులు తమ పశువులకు రైతు భరోసా కేంద్రాల వద్ద ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చని చెప్పారు.
మొగల్తూరు : అన్నదాతలు యాజమాన్య పద్ధతుల పాటిస్తే పంట దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం అన్నారు. శేరేపాలెం పంచాయతీ పరిధి నవుడూరువానిగరువులో బుధవారం సాయంత్రం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. ఎరువులు, పురుగు మందులు ఎంత మోతాదులో వాడాలో వివరించారు.