Oct 12,2023 22:48

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ : మచిలీపట్నం మండ లం వైయస్సార్‌ జగనన్న ఆదర్శ కాలనీ మేకవాని పాలెంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 116 గహ నిర్మాణాలు పూర్తయిన సందర్భంగా గహౌత్సవ కార్యక్రమంను గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాకినాడ జిల్లా సామర్లకోటలో పేద అక్క చెల్లెమ్మలకు లాంచనంగా ఇళ్ల పట్టాలను అందజేయగా, కష్ణా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం మచిలీపట్నం నియోజక వర్గంలో మేకవానిపాలెంలో జరిగింది. తొలుత జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్‌ చిటికెన వెంకటేశ్వరమ్మ, వైఎస్‌ఆర్సిపి యూత్‌ జోన్‌ ఇంచార్జ్‌ పేర్ని కష్ణమూర్తి (కిట్టు) తదితరులు వైయస్సార్‌ జగనన్న కాలనీలో పలు గహాలను పరిశీలించి నిర్మాణ తీరును పరీక్షించారు. కాలనీలో ఈ సందర్భంగా తాగునీటి కుళాయిలు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు మాట్లాడుతూ కష్ణా జిల్లాలో 89,279 గహ నిర్మాణాలు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 32,806 పైగా ఇళ్ళను నిర్మించడం జరిగిందన్నారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్‌ బూరగడ్డ రమేష్‌ నాయుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ తోట సత్యనారాయణ, హౌసింగ్‌ పీడీ జీవీ సూర్యనారాయణ, యువ నాయకులు పేర్ని కష్ణమూర్తి ( కిట్టు ), మచిలీపట్నం మండల సర్పంచులు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.