May 19,2023 19:50

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని మేకడోన గ్రామంలో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. ఖాళీ బిందెలను కుళాయిల వద్ద పెట్టి గంటల కొద్దీ నిరీక్షించి మహిళలు తాగునీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. మేకడోన గ్రామ సమీపంలోనే ఎల్‌ఎల్‌సి కాలువ, కొంత దూరంలోనే నౌలేకల్‌ ఎస్‌ఎస్‌ ట్యాంకు ఉన్నా ప్రజలకు తాగు నీటి కష్టాలు తీరడం లేదు. గ్రామంలో కొన్ని కాలనీలకు తాగునీరు సక్రమంగా అందడం లేదు. తాగునీటి కోసం శ్రీరామాలయం వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి మేకడోన గ్రామంలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మహిళలు కోరారు.