మాట్లాడుతున్న మండల విద్యాశాఖాధికారి మల్వేశ్వరరావు
ప్రజాశక్తి- అడ్డతీగల
విద్యార్ధుల మానసిక ఉలాసానికి, మేధోశక్తి బలోపేతానికి అవసరమైన శిక్షణలు విద్యార్ధులకు ఎంతగానో తోడ్పడతాయని అడ్డతీగల మండలం విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు అన్నారు. అడ్డతీగల ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఉపాద్యాయులకు వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమంపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణలు విద్యార్ధుల ఆలోచనా శక్తి పెంపోందించేందుకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం శాంతిమతి, ఫెసిలిటేటర్స్ ఎన్.నాగేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, పి.బుల్లబ్బాయి రెడ్డి, కె.సత్యనారాయణ, ఎస్.తమ్మన్నదొర, బి.చెల్లాయమ్మ, ఎస్.చిన్నాలమ్మ తదితరులు పాల్గొన్నారు.










