మేడికొండూరు: మండల కేంద్రమైన మేడికొండూరు గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక గురువారం మేడికొండూరు గ్రామపంచాయతీ సచివాల యంలో జరిగింది. ఆకస్మిక ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియలో ఎంపీ కిలో భాగంగా జరిగిన ఎన్నికలో గ్రామ ఒకటో వార్డు సభ్యురాలు అయిన పాములపాటి అనూష రాణి ఎంపికయ్యారు. రిటర్నిం గ్ అధికారిగా ఈఓపిఆర్డి పి. రవికుమార్ వ్యవహరించినట్లు ఎంపిడిఒ కె. ప్రభాకరరావు తెలిపారు.










