Apr 29,2023 22:48

మే డే కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న బాలం శ్రీనివాస్‌, రిక్షా కార్మికులు

ప్రజాశక్తి - సామర్లకోట
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను కార్మికులందరూ విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బళ్ళ మార్కెట్‌ సెంటర్‌లోని రిక్షా యూనియన్‌ ఆధ్వర్యంలో మే డే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసు మాట్లా డుతూ కార్మిక హక్కులను కుదించివేస్తున్న నేటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ వర్గాలు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నాయని, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాలకు నిరసన తెలియజే స్తున్నాయని తెలిపారు. రిక్షా కార్మికులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రిక్షా కార్మికులకు సబ్సిడీతో కూడిన రుణాలతో ఈ రిక్షాలకు ప్రభుత్వం రుణాలు అందించాలని డిమాండ్‌ చేశారు. వయసు మళ్లిన రిక్షా కార్మికులకు రూ.5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని అన్నారు. మేడేను స్ఫూర్తిగా తీసుకుని కార్మిక వర్గం ఒక్కటై మేడే ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిక్షా యూని యన్‌ గౌరవాధ్యక్షులు సిహెచ్‌ మహేష్‌, రిక్షా యూనియన్‌ నాయకులు నూకరాజు, ముప్పిడి సత్తిబాబు, మరిడయ్య, వేమగిరి సత్యనారాయణ, మిరియాల గాబ్రియేల్‌ పాల్గొన్నారు.
మే డే కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న బాలం శ్రీనివాస్‌, రిక్షా కార్మికులు