ప్రజాశక్తి-కంచికచర్ల
మేడే కార్యక్రమాన్ని కార్మికులు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ కోరారు. మంగళవారం కంచికచర్లలో కార్మికుల పని ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే రోజున కార్మికుల పని ప్రదేశాల్లో జెండా ఎగురవేయడంతో పాటు మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేయటం, చలివేంద్రాలు ఏర్పాటు చేయటం లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కళ్యాణ్, సిఐటియు మండల కార్యదర్శి బెజ్జం భూషణం, వాణి, ఆటో నాయకులు బుజ్జి, ధావలా, వీరయ్య, వెంకటరత్నం, శివ, తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కొండపల్లి పారిశ్రామికవాడ హెచ్‌పిసియల్ ఒప్పంద కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తుందన్నారు. కార్మికులకు నష్టదాయకమైన లేబర్‌కోడ్స్‌ను తక్షణమే రద్దు చేసేలా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేడే రోజున కార్మికులు ఉన్న అన్ని ప్రాంతాలలో ఎర్రజెండాలను ఆవిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం.మహేష్, హెచ్‌పిసియల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు శేఖర్, రాజశేఖర్, చెన్నారావు, పిచ్చియ్య, బ్రహ్మయ్య, జయరాజ్, బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రజాశక్తి-జి.కొండూరు: జి.కొండూరు సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ మేడే కార్యక్రమాలను కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు, సిఐటియు మండల కార్యదర్శి కె.బాలకృష్ణ, జి.కొండూరు మండల అధ్యక్షులు ఎస్.సుందరరావు, ఆటో యూనియన్ నాయకులు సదాశివరావు పాల్గొన్నారు.










