- సిఐటియు పిలుపు
ప్రజాశక్తి - కాకినాడ
కార్మిక, కర్షక, ప్రజా అనుకూల విధానాలను డిమాండ్ చేస్తూ ప్రతీ గ్రామంలో రైతులు, కార్మికులు కలిసి మేడే జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి అధ్యక్షతన జరిగిన కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎవి.నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా ఎవి. నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధా నాలను ప్రశ్నిస్తూ ఢిల్లీ రాంలీలా మైదానంలో లక్షలాది మందితో ధర్నా జయప్రదం చేసిన రైతులు, కార్మికులకు ధన్యవాదాలు తెలియ జేశాతరు. మోడీ ఇప్పటికైనా కార్మికులకు, రైతులకు అనుకూల విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు పంటలకు మద్దతుధర చట్టం చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని కల్పించి, రోజుకు 600 వేతనం చెల్లించాలని, పట్టణాల్లో కూడా అమలు చేయాలని, రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హౌదా సాధనకై అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బీజేపీ విధానాలపై పోరాడాలని సూచించారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ సిపిఎస్ రద్దుచేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించా లని, స్కిం వర్కర్లయిన అంగన్‌వాడీ, ఆశా, యనిమేటర్ల, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకోసం ఉద్యోగ, కార్మికవర్గం, రైతాంగం కలిసి పోరాటాలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కోశాధికారి మలకా రమణ, ఉపాధ్యక్షులు కె.సత్తిరాజు, ఎరుబండి చంద్రవతి, సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, బాలం శ్రీను, దారపురెడ్డి క్రాంతి, కాకినాడ నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పలివెల వీరబాబు, మెడిశెట్టి వెంకటరమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు నర్ల ఈశ్వరి, కామేశ్వరి, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, సత్యనారాయణ, విపర్తి కొండలరావు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










