సమావేశంలో మాట్లాడుతున్న ఈరన్న
ప్రజాశక్తి - ఆదోని
137వ మేడే విజయోత్సవ సంబరాలను పట్టణం, నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవాలని యుఇఇయు గౌరవాధ్యక్షులు ఈరన్న, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు కోరారు. శుక్రవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆనాడు చికాగో ప్రదర్శనలో అశువులు బాసిన కార్మికుల గుర్తుగా జెండా ఆవిష్కరణలు కౌతాళం, ఆలూరు సబ్ డివిజన్లలో నిర్వహించుకోవాలన్నారు. జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, డివిజన్, సబ్ డివిజన్‌ల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.










