Apr 22,2023 23:21

జి.మేడపాడులో కరపత్రం ఆవిష్కరిస్తున్న సిఐటీయూ నాయకులు


ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
137వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని గ్రామ గ్రామానికి జరిపి విజయవంతం చేయాలని సిఐటియూ జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాసు పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ప్రతి గ్రామంలో ప్రతి యూనియన్‌ విజయ వంతం చేయాలని కోరుతూ మండలం మాధవపట్నం, వేట్లపాలెం గ్రామాల్లో బిల్డింగ్‌ వర్కర్స్‌ కమిటీ సమావేశాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్‌ మేడే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సిఐటియు సభ్యులు మేడే పతకాన్ని ప్రతి ఇంటి వద్ద ఆవిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాధవపట్నం బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పాలిక త్రిమూ ర్తులు, కార్యదర్శి కే. లోవ బాబు, నాయకులు రమేష్‌, షేక్‌ ఖాజా, డి. శ్రీను, రాంబాబు, బాపన్‌ సాహెబ్‌ పాల్గొన్నారు.