May 09,2023 23:46

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కార్మికులు

      ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 96వ వార్డు పరిధి సిఐటియు కార్యాలయంలో మేడే వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అదాని, అంబానీలకు అండగా ఉండి కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. లేబర్‌ కోడ్‌ చట్టాలను కుదించడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికులంతా ఐక్యంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన నిర్వహించిన ఆటపాటలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు మౌలాలి, సిఐటియు నాయకులు అప్పలనాయుడు ఐద్వా నాయకులు రజిని, ఈశ్వరరావు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.